కీర్తిశేషులు కాళ్ళ గోపాలకృష్ణ గారి 4వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం

ఈ మహత్తర కార్యక్రమం, ఆయన ధర్మపత్ని శ్రీమతి కనకదుర్గ గారు మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో, దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ మరియు హోప్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈరోజు పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతూ ఉన్న నిరుపేదలకు మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవాసమితి వృద్ధాశ్రమం నివాసితులకు ప్రేమపూర్వకంగా మంచి భోజనం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆహారం అందుకుంటూ ఆశీర్వాదాలు తెలిపిన వృద్ధులు, నిరుపేదలు కళ్ళలో ఆనందభాష్పాలతో తమ కృతజ్ఞతను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఫౌండర్ నరసింహారావు గారు, సహాయ నిర్వాహకురాలు రాధా గారు పాల్గొనడం విశేషం. వారు మాట్లాడుతూ — “గోపాలకృష్ణ గారి సేవా మనోభావాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన సేవా దీక్షకు నివాళులర్పించడమంటే ఆ సేవల బాటలో నడవడమే.” అని పేర్కొన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు మరింత మంది లో సేవాభావాన్ని పెంచేలా చేయాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు